Kadiri: ఓటు హక్కు ప్రాధాన్యతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహణ!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓటు హక్కు ప్రాధాన్యతపై సోమవారం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించగా, జిల్లా స్థాయికి 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
Kadiri: ఓటు హక్కు ప్రాధాన్యతపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహణ!
సత్యసాయి జిల్లా: కదిరిలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో కదిరి నియోజకవర్గ స్థాయి వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను 16-11-2026వ తేదీన కదిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) నందు కదిరి మండల విధ్యా అధికారి చెన్న కృష్ణ ఆద్వారములో నిర్వహించారు.
ఈ పోటీలను గౌరవ కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఎ. కళావతి సందర్శించి, పోటీల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను, వారి ప్రదర్శనను ఆమె ఆసక్తిగా తిలకించారు.
పోటీలు ముగిసిన అనంతరం వివిధ విభాగాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఎ. కళావతి బహుమతులను ప్రదానం చేశారు. ఈ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన మొత్తం 10 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి కదిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.