Amaravati: అమరావతికి మారియట్ మెరుపులు.. రాజధానిలో వరల్డ్ క్లాస్ హోటల్ షురూ!

Amaravati: అమరావతిలో ప్రతిష్టాత్మక "కోర్ట్‌యార్డ్ బై మారియట్" హోటల్ ప్రాజెక్టుకు భూమిపూజ.

Update: 2026-05-08 06:29 GMT

Amaravati: అమరావతికి మారియట్ మెరుపులు.. రాజధానిలో వరల్డ్ క్లాస్ హోటల్ షురూ!

Amaravati: అమరావతి రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ హబ్‌గా రూపుదిద్దుకుంటున్న దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత మారియట్ బ్రాండ్‌కు చెందిన “కోర్ట్‌యార్డ్ బై మారియట్” హోటల్ ప్రాజెక్టుకు గురువారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. సథరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ రాజధాని అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశంగా భావిస్తున్నారు...

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు టి.జి. భరత్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, హాస్పిటాలిటీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి అతిథ్య సేవలకు ఇది నాంది పలుకుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ హోటల్ ప్రాజెక్ట్‌ను చైర్మన్ వేద్ ఖురానా,డెల్టా ప్యూర్ వాటర్ ఇండియ మేనేజింగ్ డైరెక్టర్ విక్రం కరుణాకరం భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారు. వ్యాపార మరియు వినోద ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో హోటల్‌ను నిర్మించనున్నారు...

వాయిస్ : అంతర్జాతీయ ప్రమాణాల గదులు, కాన్ఫరెన్స్ హాల్స్, ప్రీమియం డైనింగ్, ఈవెంట్ స్పేస్‌లు, కార్పొరేట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ… అమరావతిలో ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ మౌలిక వసతులు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు..

Courtyard by Marriott వంటి అంతర్జాతీయ బ్రాండ్ భాగస్వామ్యంతో రాజధాని నగర ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు. పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన వేళ… ఇలాంటి అంతర్జాతీయ హోటల్ ప్రాజెక్టులు పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకం పెంచుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, ఈవెంట్ల నిర్వహణకు ఈ హోటల్ ఉపయోగపడనుంది. దేశీయ, విదేశీ అతిథులను ఆకర్షించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 600 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది. అందులో 70 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. యువతకు హాస్పిటాలిటీ రంగంలో ప్రత్యేక శిక్షణ కూడా అందించనున్నారు. స్థానిక రైతులు, కళాకారులు, చిన్న వ్యాపారుల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు అందించనున్నారు.

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఈ “కోర్ట్‌యార్డ్ బై మారియట్” ప్రాజెక్ట్ మరో ప్రతిష్టాత్మక అధ్యాయంగా నిలవనుంది. పర్యాటకం, హాస్పిటాలిటీ, ఉపాధి, పెట్టుబడుల రంగాల్లో దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News