Amaravati: ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్న 'జెట్ స్పీడ్'.. షాక్ అవుతున్న అధికారులు!

Amaravati: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో రికార్డు సృష్టిస్తున్నారు.

Update: 2026-05-08 08:32 GMT

Amaravati: ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్న 'జెట్ స్పీడ్'.. షాక్ అవుతున్న అధికారులు!

Amaravati: ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలాలంటే రోజులు.. కొన్ని సందర్భాల్లో వారాల సమయం పడుతుందనే విమర్శలు వినిపించే రోజులు మారుతున్నాయా..? టెక్నాలజీ ఆధారిత పరిపాలనలో వేగమే ప్రధాన ఆయుధమని ఏపీ ప్రభుత్వం మరోసారి చాటుతోందా..? ముఖ్యంగా ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చూపిస్తున్న స్పీడ్ ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిష్కరిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. సీఎం చంద్రబాబు సైతం మంత్రి పనితీరును ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశమైంది..

డిజిటల్ గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం… పరిపాలనలో వేగం పెంచేందుకు ఈ-ఆఫీస్ వ్యవస్థను మరింత సమర్థంగా వినియోగిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పనిచేస్తున్న తీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. గతంలో శాఖకు సంబంధించిన ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌కు సగటున ఐదు గంటల సమయం పట్టేదని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థలో భారీ సంఖ్యలో ఫైళ్లు వచ్చినప్పటికీ… సరాసరి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల్లోనే ఫైళ్లను డిస్పోజ్ చేయడం విశేషంగా మారింది.

ఈ వేగం కేవలం సంఖ్యల పరిమితిలో కాకుండా… నిర్ణయాల అమలులో కూడా స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. రైతులకు సంబంధించిన సబ్సిడీలు, వ్యవసాయ పథకాలు, శాఖాపరమైన పరిపాలనా అనుమతులు, ఫండ్ విడుదలలు వంటి అంశాల్లో ఆలస్యం తగ్గడంతో… క్షేత్ర స్థాయిలో పనితీరు వేగవంతమైందని చెబుతున్నారు..

సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో “స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్”పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వంలో ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని, ప్రజలకు సేవలు వేగంగా అందాలని అధికారులకు పదేపదే సూచిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు పనితీరు సీఎం దృష్టిని ఆకర్షించింది. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌ను రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకురావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

పారదర్శకత, సమయపాలన, వేగవంతమైన నిర్ణయాలు… ఇవే మంత్రి అచ్చెన్నాయుడు పని విధానంలో కనిపిస్తున్న ప్రధాన లక్షణాలని అధికారులు చెబుతున్నారు. శాఖలో పెండింగ్ ఫైళ్లను తగ్గించడమే కాకుండా… ప్రతి అంశాన్ని త్వరితగతిన పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధికార యంత్రాంగంలో కూడా చురుకుదనం పెరిగిందని అంటున్నారు..

వ్యవసాయ శాఖ అనేది నేరుగా రైతులతో ముడిపడి ఉన్న కీలక విభాగం. ఇక్కడ చిన్న ఆలస్యం జరిగినా దాని ప్రభావం వేలాది మంది రైతులపై పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెరగడం వల్ల రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు త్వరితగతిన అమలవుతున్నాయని అధికారులు చెబుతున్నారు...ముఖ్యంగా సీజన్‌కు అనుగుణంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, విత్తనాలు-ఎరువుల సరఫరా, రైతు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులు వేగంగా పూర్తవుతున్నాయి. దీంతో శాఖల మధ్య సమన్వయం కూడా మెరుగుపడుతోందని తెలుస్తోంది. డిజిటల్ ఫైల్ మేనేజ్‌మెంట్‌ను కేవలం ఫార్మాలిటీగా కాకుండా… ఫలితాల దిశగా వినియోగిస్తే ఎలా ఉంటుందో మంత్రి అచ్చెన్నాయుడు ఉదాహరణగా నిలుస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం “గుడ్ గవర్నెన్స్”ను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తోంది. అందులో భాగంగా టెక్నాలజీ వినియోగం, ఈ-గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శాఖల పనితీరును కొలిచే కీలక ప్రమాణాల్లో ఈ-ఫైళ్ల క్లియరెన్స్ కూడా ఒకటిగా మారింది...ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చూపిస్తున్న వేగం… ఇతర శాఖలకు కూడా మోడల్‌గా మారుతుందా అన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు త్వరగా చేరాలంటే… ఫైల్ మూవ్‌మెంట్ వేగంగా ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి… గంటల్లో ఫైళ్ల పరిష్కారం సాధిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు పరిపాలనలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News