Amaravati: కోల్‌కతాకు చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు?

Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు నేడు కోల్‌కతా పర్యటనకు వెళ్లనున్నారు.

Update: 2026-05-09 05:07 GMT

Amaravati: కోల్‌కతాకు చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు?

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కలకత్తా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన హాజరుకానున్నారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు పాల్గొనే ఈ కార్యక్రమానికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది.

ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు బయలుదేరనున్నారు...

ఉదయం 9:20 గంటలకు Netaji Subhas Chandra Bose International Airport కు చేరుకున్న అనంతరం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో Brigade Parade Ground కు వెళ్లనున్నారు. ఈ ప్రాంగణంలోనే ప్రధాన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది...

ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనడంతో పాటు పలువురు జాతీయ నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రాల అభివృద్ధి, పెట్టుబడులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కూడా అనౌపచారిక చర్చలు జరిగే అవకాశముంది.

కోల్‌కతా పర్యటన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న సీఎం, మధ్యాహ్నం 3:45 గంటలకు Begumpet Airport కు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లనున్నారు.

ఇటీవల వరుస అధికారిక కార్యక్రమాలు, కలెక్టర్ల సదస్సు, అభివృద్ధి సమీక్ష సమావేశాలతో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు, ఈ పర్యటన ద్వారా జాతీయ రాజకీయ వేదికపై మరోసారి కీలకంగా కనిపించనున్నారు.

Tags:    

Similar News