YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలు, మహిళలను అవమానించారన్న ఆరోపణలు
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు వెల్లువెత్తాయి
YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు.. దేవతలు, మహిళలను అవమానించారన్న ఆరోపణలు
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సందర్భంగా యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అన్వేష్‌పై కేసు నమోదైంది.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా? మతపరమైన, మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. అలాగే నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన స్పందనలు ఎటు దారితీస్తున్నాయన్న అంశంపైనా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.