Bike Racing in Hyderabad: హైదరాబాద్‌లో బైక్ రేసింగ్‌ కలకలం, ఇద్దరికి గాయాలు

Bike Racing in Hyderabad: తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లతో కొందరు యువకులు రెచ్చిపోయారు.

Update: 2021-09-13 10:24 GMT

హైదరాబాద్‌లో బైక్ రేసింగ్‌ కలకలం, ఇద్దరికి గాయాలు

Bike Racing in Hyderabad: వరుస ప్రమాదాలు జరుగుతున్న యువకుల్లో మార్పు రావడం లేదు. ఖరీదైన బైకులతో మితిమించిన వేగంతో దూసుకుపోతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఇతరుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లతో కొందరు యువకులు రెచ్చిపోయారు. ట్యాంక్‌బండ్‌పై మితిమీరిన వేగంతో హంగామా సృష్టించారు. ఫ్రంట్ వీల్‌ పైకి లేపుతూ రేసింగులకు పాల్డప్పారు. ఈ సమయంలో కింద పడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తేడావచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసినా ఏమాత్రం భయం లేకుండా హంగామా సృష్టించారు.

Tags:    

Similar News