పెళ్లింట విషాదం.. రేపు పెళ్లి అనగా ఇవాళ పెళ్లి కొడుకు మృతి..

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెంలో పెళ్లింట విషాదం నెలకొంది.

Update: 2023-05-11 11:47 GMT

పెళ్లింట విషాదం.. రేపు పెళ్లి అనగా ఇవాళ పెళ్లి కొడుకు మృతి..

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా కొమ్ముగూడెంలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లి అనగా ఇవాళ పెళ్లికొడుకు మృతి చెందిన ఘటన.. స్థానికంగా విషాదాన్ని నింపింది. బోరు మోటార్‌ను రిపేర్‌ చేస్తుండగా.. కరెంట్‌షాక్‌తో పెళ్లికొడుకు భూక్య యాకుబ్‌ మృతి చెందాడు. కళ్ల ఎదుట కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు రేపు పెళ్లి పీటలు ఎక్కాల్సిన పెళ్లికొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News