Karimnagar: ప్రైవేట్ హాస్పిటల్‌లో ఘోర సంఘటన.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన యువతికి మత్తుమందు ఇచ్చి..

Karimnagar: కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువతిపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు.

Update: 2025-09-08 13:00 GMT

Karimnagar: కరీంనగర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన యువతిపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు. జగిత్యాలకు ‎చెందిన యువతి మెరుగైన వైద్యం కోసం దీపిక అనే ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. చికిత్స అందించే వైద్యుడు సూచన మేరకు ఆస్పత్రిలో పనిచేసే యువకుడు ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పి దారుణానికి ఒడిగట్టాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలిసిన సామాజిక కార్యకర్తలు, DYF నాయకులు ఆసుపత్రి దగ్గర బైఠాయించి నిరసన తెలిపి ఆసుపత్రిని మూసివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి చర్యలు తీసుకోవడానికి పోలీసులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది.

ఘటనపై DMHO విచారణ ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఇన్చార్జి DMHO చేరుకొని రికార్డులు, పర్మిషన్, ఆస్పత్రి సిబ్బంది రిజిస్టర్లను తనిఖీ చేసి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వారి వివరాలు లేవని పూర్తి సమాచారం ఆస్పత్రి నిర్వాహకుల దగ్గర లేదని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసి తక్షణ చర్యల కోసం జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల పర్మిషన్ కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు.

ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు జిల్లా పోలీస్‌ కమిషనర్. ఇందులో భాగస్వామ్యమైన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పూర్తి సాక్షాధారాలు విచారణ చేపట్టిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు అందిందని దాని ఆధారంగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు పోలీస్‌ కమిషనర్.

నగరంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఇంచార్జి డీఎంహెచ్‌వో అన్నారు. వైద్యం కోసం వస్తే ప్రాణాలు తీసిన సంఘటనలు, వైద్యం వికరించిన సంఘటనలు, చాలావరకు కనిపిస్తాయన్నారు. చికిత్స కోసం వస్తే మందు ఇచ్చి అత్యాచారం చేయడం చాలా దుర్మార్గమైన ఘటన అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టాలు కఠినతరం చేయాలన్నారు. చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News