Wine Shops: మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. రాష్ట్రంలో మూడు రోజులు వైన్‌ షాపులు బంద్‌..!

Wine Shops: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి.

Update: 2023-11-04 06:37 GMT

Wine Shops: మందుబాబులకు షాకింగ్‌ న్యూస్‌.. రాష్ట్రంలో మూడు రోజులు వైన్‌ షాపులు బంద్‌..!

Wine Shops: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. వీటితోపాటు బార్లు కూడా తెరుచుకోవు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2023 నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ డిసెంబర్‌ 1న వైన్‌ షాపులు తెరచుకోనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు రోజులపాటు మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. దీనికి సంబంధించి బార్లు, వైన్‌ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించింది.

Tags:    

Similar News