Fake Doctors: మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లు అరెస్ట్.. 5 ఆసుపత్రుల్లో బాగోతం

Five Fake Doctors Arrested in Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 5 కంటి ఆసుపత్రుల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఐదుగురు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2026-02-26 07:53 GMT

Five Fake Doctors Arrested in Nalgonda: మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లు అరెస్ట్.. 5 ఆసుపత్రుల్లో బాగోతం

Five Fake Doctors Arrested in Nalgonda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ డాక్టర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అర్హత లేకుండా కంటి ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పరిధిలోని ఐదు కంటి ఆసుపత్రుల్లో కొంతకాలంగా అర్హతలేని వ్యక్తులు డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సంబంధిత వ్యక్తులకు అవసరమైన విద్యార్హతలు, నమోదు పత్రాలు లేవని తేలింది.

వైద్య సేవల పేరిట ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ.. అర్హతలు లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ డాక్టర్లపై కఠిన శిక్షలు విధించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరింత మంది ఈ వ్యవహారంలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News