School Holiday: ఫిబ్రవరి 14న స్కూళ్లకు సెలవు ఉంటుందా? ఇదిగో క్లారిటీ
School Holiday News February 14 : ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణలో పాఠశాలలకు సెలవు అంటూ వార్తలు వస్తున్నాయి. షబ్ ఎ బరాత్ 2025 సందర్బంగా ఆప్షన్ హాలిడేగా సెలవు ఉంటుంది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్ లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్ ఎ బరాత్ కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ లో ఫిబ్రవరి 14న షబ్ ఎ బరాత్ కు సెలవు ప్రకటించినప్పటికీ దానిని సెలవు దినంగా కాకుండా ఆప్షనల్ హాలీడే కింద చేర్చింది. షబ్ ఎ బరాత్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు. చంద్రుడు ఇప్పటికే కనిపించినందున వచ్చే శుక్రవారం ముస్లిం మైనార్టీ పాఠశాలలకు సెలవు దినంగా పాటించనున్నాయి.
ఫిబ్రవరి 14వ తేదీన ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ షబ్ ఎ బరాత్ పర్వదినాన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తారు. ఈ దినాన్ని క్షమాపణ రాత్రి అని పిలుస్తుంటారు. షబ్ ఎ బరాత్ ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తుంటారు. సాయంత్రం వేళల్లో తమ ప్రియమైన వారి సమాధులను సందర్శిస్తారు. కొందరు షబ్ ఎ బరాత్ రోజున ఉపవాసం ఉంటుంటారు.
ఈ ప్రార్థన ద్వారా అల్లాను క్షమాపణలు కోరుతుంటారు. ఆ రోజు చేసే ప్రార్థనల వల్ల తప్పులన్నింటిని క్షమించి మోక్షం ప్రసాదిస్తాడని ముస్లింలు నమ్ముతుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇలా ముస్లింల పవిత్రమైన రోజు కాబట్టి ఈ షబ్ ఎ బరాత్ సందర్బంగా ఫిబ్రవరి 14న ఆప్షనల్ హాలుడే ఇచ్చింది తెలంగాణ సర్కార్. అంటే విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ రోజున సెలవు ఇవ్వవచ్చు. లేదంటే స్కూల్ నిర్వహించే అవకాశం ఉంది. తుది నిర్ణయం పాఠశాల యాజమాన్యాలదే.