Dharmapuri Arvind: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటా..
Dharmapuri Arvind: మెదక్ జిల్లా రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్, పద్మ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పరామర్శించారు.
Dharmapuri Arvind: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటా..
Dharmapuri Arvind: మెదక్ జిల్లా రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న గంగం సంతోష్, పద్మ కుటుంబాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పరామర్శించారు. రాష్ర్టంలో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయని..వ్యాపారం చేసుకుంటున్న సంతోష్ కుటంబాన్ని వేధింపులకు గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని అర్వింద్ ఆరోపించారు.
టీఆర్ఎస్ నాయకుల అండతో పోలీసులు టార్చర్ తోనే కామారెడ్డిలో తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ర్టంలో ఆత్మహత్యలు, హత్యలకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. సంతోష్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టఆర్ఎస్ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానని చెప్పారు.