Dharmapuri Arvind: తెలంగాణలో అధికారం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం
Dharmapuri Arvind: తెలంగాణలో ఆధికారంలోకి రావటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
Dharmapuri Arvind: తెలంగాణలో అధికారం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం
Dharmapuri Arvind: తెలంగాణలో ఆధికారంలోకి రావటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని గతంలో కవిత, కేటీఆర్‌లు లక్ష సార్లు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ కుటుంబం తీరు దురదృష్టమన్నారు. విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించటంపై తెలంగాణ సమాజం హర్షిస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. విమోచన దినోత్సవం మాత్రమే.. జాతీయ సమైక్య దినోత్సవం కాదని స్పష్టం చేశారు. అమరవీరులను సీఎం కేసీఆర్ అగౌరవపరిచారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.