గెలుపెవరిది..?

రసవత్తరపోరుకు హుజూర్‌నగర్‌ సిద్ధమైంది. మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు, తమ ప్రతినిధిని ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. 7 మండలాల పరిధిలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ స్పష్టం చేశారు.

Update: 2019-10-20 05:09 GMT

రసవత్తరపోరుకు హుజూర్‌నగర్‌ సిద్ధమైంది. మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు, తమ ప్రతినిధిని ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. 7 మండలాల పరిధిలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసీ స్పష్టం చేశారు. ఇందుకోసం 302 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బందికి ఈవీఎమ్‌లు, ఇతర సామాగ్రిని అందజేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నారు.

ఈ సాయంత్రానికి సామాగ్రిని సిబ్బందికి అప్పజెప్పనున్నారు. ఇందుకోసం హుజూర్‌నగర్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఇటు ప్రచారంలో సర్వశక్తులూ ఒడ్డిన అధికార విపక్షాలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అని ప్రతిపక్షాలు అంటుండగా అలాంటిదేమీ లేదని అధికార టీఆర్ఎస్‌ కొట్టిపారేసింది. మరోవైపు హుజూర్‌నగర్‌లో ప్రచారం చేయాల్సిన సీఎం కేసీఆర్‌ ఆఖరు నిమిషంలో బహిరంగసభ రద్దు కావడంతో కాంగ్రెస్‌ నాయకులంతా అక్కడే మకాం వేశారు. ఇంక రేపు జరిగే పోలింగ్ లో గెలుపెవరిదో వేచి చూడాల్సిందే.



Tags:    

Similar News