Weather Updates: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Weather Updates: గత ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు ఎక్కడికక్కడ పొంగి పొరలుతున్నాయి.

Update: 2020-08-15 04:41 GMT
Heavy Rains in Telugu States

Weather Updates: గత ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే వాగులు వంకలు ఎక్కడికక్కడ పొంగి పొరలుతున్నాయి. ఇదే క్రమంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడి, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వానలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అల్పపీడన రెండు రోజుల్లో మరింతగా పలడనుందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభాంతో ఏపీలో శనివారం రోజున ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విధంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాలనుంచి వచ్చి చేరుకుంటున్న వరద నీటి ప్రభావంతో నదులు, చెరువులు, వాగులు నిండుకుండను తలపిస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపి పెరుగుతూ వస్తోంది. గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గోదావరిలో వరద ప్రవాహాన్ని సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. అటు సముద్ర ప్రాంతాల్లో వేటకు వెళ్లే మత్సకారులను వెళ్లవద్దని హెచ్చరించింది.

ఇక పోతే రాష్ట్రంలో ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 9.190 టీఎంసీలుగా ఉండగా ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. మరోవైపు భద్రచలం దగ్గర గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే నీటిమట్టం 43.4 అడుగులకు చేరుతోంది.




Tags:    

Similar News