Top
logo

తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణకు భారీ వర్షసూచన
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Heavy rains in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి.

Heavy rains in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. అయితే రానున్న మరో 24గంటల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాతావరణం రాబోయే మూడు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో సోమవారం రోజున అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా నిన్నటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విస్తరించి ఉంది. రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో పడనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహమూబాబాద్‌, ఖమ్మం జిల్లాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెప్పింది. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నందున రైతులు పంటలు కొట్టుకుపోకుండా జాగ్రత్తలు పడాలని, వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో బయటికి రాకుండా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.
Web TitleHeavy rains in Telangana : Heavy rains in Telangana in the next 24 hours
Next Story