Weather update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు
weather update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
Weather update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు
weather update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి, వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాబోయే ఐదు రోజుల్లో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరికొన్నింటికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
దక్షిణ తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీంతో శనివారం వరకు మత్స్యకారులు సముద్ర యాత్రలు చేయవద్దని సూచించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గాలులు వీచే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.