అలెర్ట్ : మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం

weather Report : తెలంగాణను వాన గండం భయపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2020-10-18 10:58 GMT

weather Report : తెలంగాణను వాన గండం భయపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అది అల్పపీడనంగా మారనుందని అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడే అవకాశముందన్నారు.

ఇక ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇక హైదరాబాద్ పై వరుణుడు పగబట్టాడు. పట్నాన్ని వరద వదలడం లేదు. మొన్న కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న నగర వాసులకు.. మరోసారి తన ప్రతాపం చూపించాడు. దాంతో మరోసారి నగర ప్రజలు వణికిపోయారు. పలు కాలనీలు జలదిగ్భాంధంలోనే ఉన్నాయి. వరద ప్రవాహనికి వాహనాలు కొట్టుకుపోయాయి. చెరువులు నిండి సమీప ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

శనివారం కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. వరద ప్రాంతాల్లో వాహన దారులు నీళ్లలో నుంచి ఎవరు వెళ్లకూడదని.. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వరద నీటిలో వహనాలు వస్తే సీజ్ చేస్తామని అన్నారు. 

Tags:    

Similar News