Gazette Notification: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్పు
Gazette Notification: వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.
Gazette Notification: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్పు
Gazette Notification: వరంగల్, హన్మకొండ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. చారిత్రక ప్రదేశాలకు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయం పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జిల్లాల పేర్లు మార్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త గా ఏర్పాడే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెండు రెవెన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాలతో హన్మకొండ జిల్లా అవతరించింది.