తెలంగాణలో ఇవాళ జాతీయ నేతల పర్యటన.. డోర్ టు డోర్ గ్యారంటీ స్కీమ్ కార్డ్స్‌ పంపిణీ

Telangana: 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న నేతలు

Update: 2023-09-18 02:19 GMT

తెలంగాణలో ఇవాళ జాతీయ నేతల పర్యటన.. డోర్ టు డోర్ గ్యారంటీ స్కీమ్ కార్డ్స్‌ పంపిణీ

Telangana: తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇవాళ పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు పర్యటించనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు జాతీయ, పీసీసీ నాయకులు ఈ పర్యటనలకు వెళ్తారు. ఇవాళ ఉదయం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ హామీల గ్యారంటీ కార్డు గురించి వివరిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రధాన సెంటర్లలో ఈ కార్డులను పబ్లిష్ చేస్తారు. మధ్యాహ్నం కార్యకర్తలతో కలిసి తెలంగాణ వంటకాలతో భోజనం చేస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతల ఇంటికి వెళ్లి వారిని సన్మానిస్తారు. సాయంత్రం 4 గంటలకు భారత్ జోడో ర్యాలీ చేపడుతారు. ర్యాలీ అనంతరం జాతీయ నేతల మూడు రోజుల పర్యటన ముగుస్తుంది.

Tags:    

Similar News