Nalgonda: ఫేక్ బాబా సాయి విశ్వచైతన్య అరెస్ట్..లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు వస్తాయని..

Nalgonda: యూ ట్యూబ్ చానెల్ ద్వారా దేవుడినని ప్రచారం చేసుకున్న సాయి విశ్వచైతన్య అలియాస్ సాయి మురళిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2021-08-03 15:43 GMT

Nalgonda: ఫేక్ బాబా సాయి విశ్వచైతన్య అరెస్ట్

Nalgonda: యూ ట్యూబ్ చానెల్ ద్వారా దేవుడినని ప్రచారం చేసుకున్న సాయి విశ్వచైతన్య అలియాస్ సాయి మురళిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పీఏ పల్లి మండలం అజమాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అరాచకాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు బురీడి బాబా ఆటలను పోలీసులు కట్టించారు. మహిళా భక్తులపై లైంగిక దాడితో పాటు వారి నుంచి లక్షల్లో నగదు వసూలు చేసినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో బాబాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుల నుంచి 26 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, 1.10 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు, భారీ ఎత్తున పూజా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. విశ్వచైతన్య స్వామికి 40 దేశాల్లో భక్తులు ఉన్నట్లుగా నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఇతడికి 11 మంది మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, లైంగికంగా కలిస్తే తనలోని శక్తులు వస్తాయని మహిళలను నమ్మించేవాడన్నారు. మాయమాటలతో మహిళలను ట్రాప్‌ చేసి వీడియో కాల్స్‌ చేసేవాడు. రెండో భార్య సుజితపై రూ.1.30 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.

Tags:    

Similar News