వాహనదారులకు శుభవార్త.. ఫ్యాన్సీ నెంబర్లు ఆన్‌లైన్‌లో..?

Update: 2019-11-17 04:11 GMT
vehicle registration fancy numbers

ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులకు మోజు ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మంది వాహనదారులు ఎంత ఖ‌ర్చు పెట్టేనా ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతుంటారు. సినీనటినటులు కూడా వాటి కోసం ఆర్టీవో ఆఫీసులకు వెళ్తారు. గతంలో వావాహనదారులు నెంబర్ ప్లేట్‌లో తొమ్మిది అనే సంఖ్య కోసం వెంపర్లాడుతుంటారు. అయితే తాజాగా ఫ్యాన్సీ నెంబర్ల వాహనదారులు మరింత చేరువ చేయనుంది.

గతంలో ఆర్టీవో స్థాయిలో ఫ్యాన్సీ నంబర్లు కేటాయించే సీల్డ్‌కవర్ వేలం విధానంలో బిడ్డింగ్ ప్రక్రియ చేపడుతుంటారు. అయితే ఈ విధానానికి బదులుగా ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని ఆర్టీఓ భావిస్తుంది. త్వరలో ఆన్‌లైన్ ద్వారా వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపు అమల్లోకి రానుంది. ఇప్పటికే నూతన విధానం అమల్లోకి రావాల్సివుంది. రవాణాశాఖ అధికారులు తాత్కాలిక బస్సులు నడిపించే పనిలో బీజీగా ఉన్నారు.

ఆర్టీసీ సమ్మె కొలిక్కిరాగానే ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్‌ స్లాట్ బుక్కింక్ లాంటి సేవలను ఇప్పటికే ఆన్‌లైన్ చేశారు. ఆర్సీ, లైసెన్సుల దరఖాస్తులకు ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ను అందుబాటులో ఉంది. రవాణాశాఖలో 50 సేవలు ఆన్‌లైన్ చేశారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం వీఐపీల తాకిడి ఎక్కవ కావడంతో వేలం వివాదస్పదమవుతుంది. దీంతో ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీవో అధికారులు భావిస్తున్నారు.

 

Tags:    

Similar News