vegetables Robbery in software saradha shop ; 'సాఫ్ట్‌వేర్‌ శారద' దుకాణంలో కూరగాయలు చోరీ!

లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధిని కోల్పోయారు. అందులో భాగంగానే శారద అనే అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది.

Update: 2020-07-31 15:34 GMT
vegetables Robbery software saradha shop in srinagar colony

vegetables Robbery in software saradha shop ; లాక్ డౌన్ వలన చాలా మంది ఉపాధిని కోల్పోయారు. అందులో భాగంగానే శారద అనే అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. ఉద్యోగం పోయినప్పటికి మనోస్థైర్యం కోల్పోకుండా జీవనాధారం కోసం దారులు వెతికింది. కుటుంబ పోషణకి గాను హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో ఫుట్‌పాత్‌పై కూరగాయలు అమ్ముకుంటుంది. అయితే ఎప్పటిలాగే మంగళవారం రాత్రి కూడా కూరగాయలు విక్రయించి ఆ తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి ఇంటికి వెళ్ళిపోయింది.

ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. దాదాపుగా అయిదు వేల రూపాయల విలువైన కూరగాయలని కోల్పోయినట్టుగా శారద ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తన తండ్రి కూరగాయలు విక్రయించేటప్పటి నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను బండిపైనే పెట్టి కవరు కప్పి వెళతారని, ఎప్పుడూ కూడా ఇలా దొంగతనం జరగలేదని శారద వెల్లడించింది.

వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. దీనితో ఆమె కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మీడియా అనేక రకాల కథనాలని వెల్లడించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పలువురు రాజకీయ నాయకులు ఆమెను పలకరించారు. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా స్పందించి సహాయం చేసిన సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News