Subhash Reddy: రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిస్తా.. ఎల్లారెడ్డిలో రెబల్‌గా పోటీ చేస్తా..

Subhash Reddy: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకున్నాయి.

Update: 2023-10-28 13:45 GMT

Subhash Reddy: రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిస్తా.. ఎల్లారెడ్డిలో రెబల్‌గా పోటీ చేస్తా..

Subhash Reddy: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రగులుకున్నాయి. మదన్ మోహన్‌కు రెండో జాబితాలో టికెట్ కేటాయించడంపై వడ్డేపల్లి సుభాష్ రెడ్డితో పాటు అనుచరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబెల్ గా పోటీ చేస్తానని వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అన్నారు. కార్యకర్తలు, అభిమానులు అభీష్టం మేరకు రెండు రోజల్లో పూర్తి స్థాయి నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం చేశారని, కాంగ్రెస్ పార్టీ లాబీయిస్టు పార్టీగా మారిందని ఆరోపించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తే ఓడిస్తానని సుభాష్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News