హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

Update: 2019-09-15 04:49 GMT

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సతీమణి నల్లమాడ పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విహయంపై స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం మేరకే పద్మావతిని అభ్యర్థిగా అధిష్టానం ఫైనల్‌ చేసిందని చెప్పారు. ఇదిలావుంటే అసెంబ్లీ హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తమ్.. అయితే ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్‌ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్‌ఎస్‌ కూడా హుజూర్‌నగర్‌ స్థానాన్ని ఎంతో ‍ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

Tags:    

Similar News