Dubbaka Byelection : టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దిగజార్చుతుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Update: 2020-10-05 12:36 GMT

Dubbaka Byelection : రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయినా విలువలు పాటించిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థి గురించి గాంధీ భవన్‌లో సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిస్టార్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బంధీ చేశారని ఆరోపణలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థి ప్రకటన రేపు చేస్తామని ఆయన తెలిపారు. ఏ అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టాలనే అంశంపైన ఇంకా పార్టీలో చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ లూటీ చేస్తూ రాజకీయాన్ని కమర్షియల్ చేసిందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య విలువలు మరింత పెరుగుతాయి అనుకున్నామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను దిగజార్చుతుందని, తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం టీఆర్‌ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతాం అని ఆయన తెలిపారు. కరోనా సమయంలో రాజకీయ పార్టీలు సమావేశాలు-భేటీలు పెట్టొద్దన్న టీఆర్‌ఎస్ తాను మాత్రం అన్ని జరిపిందన్నారు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బరిలో మళ్ళీ నిలబెట్టారు. నిజామాబాద్‌ జిల్లాలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల ఉల్లంఘనకు టీఆర్‌ఎస్ పార్టీ పాల్పడింది. ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ ఇతర పార్టీ నేతలను డబ్బులు పెట్టి కొంటుంది.

అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ లోక్ సభలో ఓడిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టారని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిసార్ట్‌లో వంద మంది చొప్పున జడ్‌పీటీసీలను బందీ చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి-నిజామాబాద్ కలెక్టర్‌కు విజ్ఞపి చేసినా పట్టించుకోవట్లేదు. 'కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చారని రాములు నాయక్- భూపతి రెడ్డిని డిస్‌క్వాలిపై చేశారు. లోకల్ బాడీలో ఏ పార్టీ తరపున ఎన్నికైతే పదవీకాలం అయ్యే వరకు అదే పార్టీలో కొనసాగాలి. పార్టీ మారితే వెంటనే డిస్‌క్వాలిపై చేయాలి అని కోరారు.

Tags:    

Similar News