ఇవాళ బ్లాక్ డేగా మారింది : షబ్బీర్ అలీ

X
Highlights
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. పవిత్రమైన...
Arun Chilukuri2 Jun 2020 4:54 AM GMT
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. పవిత్రమైన రాష్ట్ర ఏర్పాటు రోజు పోలీసులు ఇలా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో ఇవాళ బ్లాక్ డే గా మారిందని ఆయన అన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే ఇలాంటి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చి ఆరేళ్ళ తరువాత కూడా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని , అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. 20 వేల కోట్లు పెడితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యేవన్నారు. సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల కోసమే 2 లక్షల కోట్లు అప్పు మిగిలిందని, ఉద్యోగాలు జీరో, నీళ్లు జీరో.. ఉపాధి జీరో అని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వ నియంతృత్వ పాలనపై ఆలోచించాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Web TitleShabbir Ali criticizes Telangana formation day as Black Day in Telangana
Next Story