Telangana Local Body Elections: ఆదిలాబాద్ జిల్లా పల్లెల్లో ఎన్నికల కోలాహలం

Telangana Local Body Elections: పల్లె సీమల్లో ఎన్నికల సందడి..ఓ పక్క నామినేషన్లు..మరో పక్క ఉప సంహరణకు మంతనాలు..పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు.

Update: 2025-12-04 06:45 GMT

Telangana Local Body Elections: పల్లె సీమల్లో ఎన్నికల సందడి..ఓ పక్క నామినేషన్లు..మరో పక్క ఉప సంహరణకు మంతనాలు..పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పల్లెల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1514 గ్రామపంచాయతీల్లో ఈ నెల 11,14,17 వ తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. రెండవ విడతలో జరిగే జీపీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల స్వీకరణ పర్వం మంగళవారంతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడుతుండగా అన్ని పార్టీల నుండి రెబల్స్ కూడా రంగంలో ఉన్నారు..అయితే డబ్బుస ఆశాచూపి ఏకగ్రీవాలకు పాల్పడే వ్యవహారంపై అధికారులు సైతం దృష్టి సారించారు.

సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు కేటాయించే గుర్తులపై చర్చసాగుతోంది అభ్యర్థుల పేర్ల ఆధారంగా తెలుగు వర్ణమాలతో గుర్తు కేటాయించనున్నారు అధికారులు. ఈసారి అన్ని మేజర్ గ్రామ పంచయాతీల్లో త్రిముఖ పోటీ ఉండగా, జనరల్ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉంది. తాంసీ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీకి గతంలో గ్రామస్తులు సర్పంచ్ స్థానం ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి ఈ స్థానం జనరల్ కు కేటాయించడంతో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అన్ని జనరల్ స్థానాల్లో ప్రధాన పార్టీల నుండే కాకుండా, రెబల్స్ కూడా పోటీలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు పార్టీ తరఫు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. తామంటే తామంటూ పోటీచేసే వారు నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామాల్లో అన్ని పార్టీల క్యాడర్ గ్రూపులుగా విడిపోయారు. అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించే పనిలో పడ్డారు నేతలు.  

Tags:    

Similar News