సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: రామానుజ పునర్జన్మను సాక్షాత్కరించారు.
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో ధర్మాచార్య సభలో ఆయన ప్రసంగించారు. దేశ సంస్కృతి భిన్నత్వంతో నిండి ఉందన్నారు రాజ్‌నాథ్‌సింగ్. సమానత్వ ప్రతిమ అయిన స్వామి రామానుజ భారీ విగ్రహాన్ని నిర్మించి ఆయన పునర్జన్మను సాక్షాత్కరించారని ఆయన అన్నారు. ఆయన బోధనలు, ఆదర్శాలు, విలువలు ఈ విగ్రహం ద్వారా రాబోయే యుగాలకు లభిస్తాయని తాను నమ్ముతున్నానని రాజ్‌నాథ్ సింగ్అభిప్రాయపడ్డారు.