Amit Shah: రేపు హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్‌ షో

Update: 2024-04-30 09:01 GMT

Amit Shah: రేపు హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రేపు సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. టూర్‌లో భాగంగా ఆయన హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జరిగే రోడ్‌షోకు హాజరుకానున్నారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్ వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఇక రోడ్ షో తర్వాత రాత్రి 9 గంటల 15 నిమిషాల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశంకానున్నారు అమిత్ షా. మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే రాత్రిబస చేస్తారు.

Tags:    

Similar News