Peddapalli: విషాదం.. కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండంలో విషాదం

Update: 2024-01-18 14:45 GMT

Peddapalli: విషాదం.. కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిఖనిలో కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న ఇద్దరు వ్యక్తులు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే వారు చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News