Weather Report: తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

* ఉత్తర భారతానికి భారీ వర్షాలు * మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

Update: 2021-08-01 02:04 GMT

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు

Rains in Telangana: దేశంలో పలు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణలోనూ ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.

Tags:    

Similar News