Swetcha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య
Swetcha Votarkar: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Swetcha Votarkar: ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య
Swetcha Votarkar: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని తన నివాసంలో రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆమె ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ, ప్రస్తుతం కూతురు మరియు ఒక స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్టు సమాచారం. ఆ స్నేహితుడితో వచ్చిన మనస్పర్థలే ఆమెను ఈ నిర్ణయానికి దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్‌లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో క్రియాశీలంగా ఉన్నారు. శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.