TSRTC: హైదరాబాద్ - విజయవాడ బస్సులు రద్దు.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..!

TSRTC: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది.

Update: 2023-07-28 13:30 GMT

TSRTC: హైదరాబాద్ - విజయవాడ బస్సులు రద్దు.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..!

TSRTC: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో రెగ్యులర్‌ సర్వీసులను TSRTC రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి బయలుదేరుతుంది. దీనికి సంబంధించి ఆర్టీసి ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News