VC Sajjanar: బస్సులో డాన్స్ చేసిన సజ్జనార్.. కుటుంబ సభ్యులతో కలిసి..

VC Sajjanar: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ చక్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు కీలక చర్యలు తీసుకున్నారు.

Update: 2021-11-30 09:08 GMT

VC Sajjanar: బస్సులో డాన్స్ చేసిన సజ్జనార్.. కుటుంబ సభ్యులతో కలిసి..

VC Sajjanar: ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ చక్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎండీ. ఇందుకుగాను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సజ్జనార్. అంతేకాదు.. వారితో కలిసి డాన్స్ చేస్తూ అందరిని ఉత్సహారపరిచారు. దీంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 3న ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్. సంస్థ పురోగతిపై దృష్టిసారించి, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా 81 రోజుల వ్యవధిలో 370 ఫిర్యాదులు రాగా, వాటిలో 364 పరిష్కరించారు సజ్జనార్.


Tags:    

Similar News