TS TET 2025: తెలంగాణ టెట్ పరీక్ష తేదీలు అధికారికంగా విడుదల
TS TET 2025 రాత పరీక్షలు జూన్ 18 నుండి 30 వరకు జరుగనున్నాయి. 1.83 లక్షల మందికిపైగా దరఖాస్తు చేయగా, పరీక్షలు రోజుకు రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
TS TET 2025: తెలంగాణ టెట్ పరీక్ష తేదీలు అధికారికంగా విడుదల
TS TET 2025: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2025)కు సంబంధించి పరీక్ష తేదీలను విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. గతంలో ఏప్రిల్ 30 అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అయితే అప్పటివరకు పరీక్ష తేదీలను వెల్లడించకపోయినా, ఇప్పుడు స్పష్టత వచ్చింది. తాజా ప్రకారం, టెట్ 2025 పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబోతున్నారు. 9 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో, మొత్తం 16 సెషన్లకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష షెడ్యూల్
మొదటి సెషన్: ఉదయం 9:00 నుండి 11:30 వరకు
రెండో సెషన్: మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు
దరఖాస్తుల వివరాలు:
పేపర్ 1కు: 63,261 మంది
పేపర్ 2కు: 1,20,392 మంది
రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు సుమారు 15,000 మంది ఉన్నారు.
ఇతర సంవత్సరాలతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపించింది. జనవరిలో జరిగిన టెట్‌లో 2,75,775 మంది అప్లై చేయగా, ఈసారి దాదాపు 92,000 దరఖాస్తులు తక్కువగా ఉన్నాయి.
అయినా కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఇప్పటికే ఎస్‌జీటీగా పనిచేస్తున్నవారు మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
TS TET 2025 పరీక్షలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌కు మాకు ఫాలో అవ్వండి.