TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
TS High Court: నియామకాలను సవాల్ చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణ
TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
TS High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా గవర్నర్ కోటాలో కొత్తగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఎన్నికయ్యారు. ఈ నియామాకాలను సవాల్ చేశారు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ. నిన్న తెలంగాణ మండలికి ప్రమాణ స్వీకారానికి కొత్తగా ఎన్నికైన సభ్యులు వచ్చారు. స్పీకర్ అనారోగ్యంతో ఉన్నారని అందుకే రాలేక పోయారని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నేడు ప్రమాణ స్వీకారం చేస్తామని అన్నారు. ఇంతలోనే కోర్టు తదుపరి తీర్పును ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.