TS Eamcet 2024: మే రెండో వారంలో ఎంసెట్?
TS Eamcet 2024: ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేస్తోన్న అధికారులు
TS Eamcet 2024: మే రెండో వారంలో ఎంసెట్?
TS Eamcet 2024: తెలంగాణ ఎంసెట్‌ను ఈ ఏడాది మే నెలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం ఏడు పరీక్షలకు ఎంసెట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ఈ మేరకు పరీక్ష తేదీలపై కసరత్తులు పూర్తి చేసింది. మే రెండో వారంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి సారి ఎంసెట్ పరీక్ష నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావివ్వద్దని, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని ఆయన గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. పరీక్ష ప్రశ్నాపత్రాల నుంచి నిర్వహణ వరకూ పకడ్బందీగా ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.