TS EAMCET Results: ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి.

Update: 2021-08-25 04:05 GMT

ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు సమాచారం. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెంట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను వీటి తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

తెలంగాణలో ఎంసెట్-2021 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

Tags:    

Similar News