సీఎం పదవిపై స్పందించిన కేటీఆర్

సీఎం పదవిపై తెలంగాణ మున్సిపల్ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

Update: 2020-01-01 16:06 GMT
Ktr File Photo

సీఎం పదవిపై తెలంగాణ మున్సిపల్ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ స్పష్టత ఇచ్చిన తర్వాత అనుమానం ఎందుకని ప్రశ్నించారు. తాను సీఎం అవుతానన్న చర్చ ఇప్పుడు అవసరం లేదని స్పష్టం చేసిన కేటీఆర్...కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు.

కొత్త దశకంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు రాష్ర్ట మున్సిపల్ శాఖ మంత్రి., టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ పలు అంశాలపై మాట్లాడుతూ సీఎం పదవిపై స్పందించారు. ఈ ఏడాది దాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదని స్పష్టం చేశారు కేటీఆర్. ఇప్పటికే ఇదే విషయాన్ని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు.

2019 సంవత్సరం బ్రహ్మాండమైన ఆరంభాన్ని ఇచ్చిందని.. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామన్నారు కేటీఆర్. కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. ఈనెల మొదటి వారంలో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సమావేశం ఉంటుందని..మున్సిపల్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ, దిశానిర్ధేశం చేస్తారని కేటీఆర్ చెప్పారు.

ఎంపీ ఎన్నికల్లో అనుకున్నది సాధించలేకపోయినా.. రెండు జాతీయ పార్టీలతో పోల్చితే తామే నెంబర్ వన్ అని చెప్పుకొచ్చారు. 2020-30 దశకం టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని తెలంగాణ రాష్ర్టానిదే అని చెప్పారు. నిజామాబాద్‌లో ఎంఐఎం నిర్వహించిన సభలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నంత మాత్రాన.. హిందువులు వ్యతిరేకం కారని...కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఉన్నాడా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు ఎవరూ శాశ్వత శత్రువులు లేరని. రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఉత్తమ్ రాజీనామా ఆయన వ్యక్తిగత వ్యవహారమని..టీఆర్ఎస్ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఏపీతో తెలంగాణకు మంచి సంబంధాలు లేవని ఎవరు చెప్పారని ప్రశ్నించిన కేటీఆర్.. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చారు.  

Tags:    

Similar News