టీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
Operation Akarsh: తెలంగాణలో మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ఎస్ జాతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్ వేస్తోంది.
టీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
Operation Akarsh: తెలంగాణలో మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న టీఆర్ఎస్ జాతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్ వేస్తోంది. బలమైన నేతలకు కారెక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. క్షేత్ర స్థాయిలో సత్తా ఉన్న నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తోంది. గ్రామ, మండల స్థాయి నేతలను టార్గెట్ చేస్తోంది. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ నేతలకు గులాబీ కండువాలు కప్పుతున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఐతే తాజా ఆలోచన వెనుక నేషనల్ పార్టీలను కార్నర్ చేయాలన్న ప్రణాళిక ఉంది. ఓట్లు సాధించే నేతలను బుట్టలో వేసుకుంటే కాంగ్రెస్, బీజేపీలను గ్రౌండ్‌లో వీక్ చేయొచ్చని భావిస్తోంది. నిధులు, కాంట్రాక్టులతో విపక్ష నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది.