MLC Kavitha: దేశంలో గులాబీ కండువా విప్లవం సృష్టించ‌బోతోంది..

MLC Kavitha: తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే... ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Update: 2022-11-12 13:30 GMT

MLC Kavitha: దేశంలో గులాబీ కండువా విప్లవం సృష్టించ‌బోతోంది..

MLC Kavitha: తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే... ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గులాబీ కండువా అధికారంలో ఉన్నప్పుడే... తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. గులాబీ జెండా ఎగిరే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని గతంలో మంత్రిగా ఉన్న జీవన్‌రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఒకప్పుడు రాయికల్‌ వలసల మండలంగా ఉండేదని ఇప్పుడు పంటలమయం అయ్యిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News