వ్యాధులను తరిమికొట్టే గిరిజనుల పండుగ జాగైమాథుర్ !

Update: 2020-08-22 08:26 GMT

Tribes Festival Jagai Mathur in Adilabad: పరిశుభ్రతను పాటించడానికీ ఓ పండగ దినం నిర్వహిస్తున్నారు గిరిజనులు అంటురోగాలను తరిమి కొట్టేందుకు నెల రోజుల దీక్షతో ఆచారాన్ని పాటిస్తున్నారు. గిరిజనులు నిర్వహించే జాగై మాథుర్ పండగ వల్ల వ్యాధులు దరిచేరవట ఈ పండుగ ప్రత్యేకత ఏంటి? అది ఎలా నిర్వహిస్తారు అన్న అంశంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ గూడేలు రోగాలతో వణుకుతుంటాయి. అసలే కరోనా సమయం దాంతో ఈ సీజన్ లో రోగాలు రాకుండా ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలు పాటిస్తున్నారు. పోలాల అమావాస్య ముందు అమావాస్యను చుక్కల అమావాస్యగా గిరిజనులు పిలుస్తారు. అప్పటినుండి పోలాల అమావాస్య వరకు రోగాలు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా నెల రోజుల పాటు పిల్లలు రోగాల బారిన పడకుండా కోడాంగ్ క్రీడను నిర్వహిస్తున్నారు. ఇది కాళ్లకు మట్టి అంటకుండా పిట్ నెస్ పెంచుకోవడానికి వెదురు కర్రలతో నడక సాగించడం అలా ఆవిధంగా నెల రోజుల పాటు అంటు వ్యాధులు రాకుండా గిరిజనులు జాగ్రత్తలు తీసుకుంటూ పోలాల అమావాస్య మరుసటి తెల్లవారు జామును జాగై మాథుర్ నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా నెలరోజుల పాటు నడిచి వెదురు కర్రలను, అదేవిధంగా పోలిమేర దేవతకు సమర్పించడానికి నైవేద్యం తీసుకోని గిరిజనులు జాగై మాథూర్ అంటూ పోలిమెరకు వెళ్లుతుంటారు. ఈ సందర్బంగా జాగైమాథూర్ అంటూ రోగాలను పారిద్రోలుతూ నడుస్తారు. ఈ గ్రామంలో విజృంభించే రాకాసి రోగాలను దూరం వెళ్లిపోవాలని గిరిజనులు పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ శివారు ప్రాంతానికి చెరుకుంటారు. అక్కడ పోలిమేర దేవతకు గిరిజనులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురు కర్రలతో నడవడమే కాదు, అదేవిదంగా పోలిమేర దేవతకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈసారి ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనా మటుమాయం కావాలని గిరిజనులు జాగై మాథూర్ ను వేడుకున్నారు. పోలిమేర దేవతకు సమర్పించగా మిగిలిన నైవేద్యాన్ని ఆ తర్వాత గూడేనికి చెందిన గిరిజనులు అందరూ ఒకచోట కూర్చోని సహపంక్తి గా అందరూ ఆరగిస్తారు.

అనంతరం మళ్లీ గిరిజనులు ఇంటి బాటపడుతుంటారు. వచ్చేటప్పుడు అడవులలో వనమూలికలు తీసుకోని ఇంటిబాట పడుతుంటారు. తెచ్చుకున్నా వనమూలికలు జ్వరాలు వచ్చిన సందర్భంలో వాటిని వినియోగించుకుని రోగాల నుండి విముక్తిపొందుతుంటారు. జాగై మాథుర్ నిర్వహించడం వల్ల రోగాలు దూరం పోతాయని గిరిజనులు అంటున్నారు. అందుకే కొన్నేళ్లుగా నెల రోజుల పాటు రోగాలు దూరం కావడానికి జాగై మాథుర్ కు దీక్షతో పూజలు చేస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. దేవత అనుగ్రహంతోనే తమకు అంటువ్యాధులు దూరం అవుతున్నాయని గిరిజనుల విశ్వాసం. ఒకరోజు పరిశుభ్రత పాటించి ఆ తర్వాత మరిచిపోతున్నా ఈ రోజుల్లో రోగాలను తరిమికొట్టడానికి గిరిజనులు నిర్వహిస్తున్న జాగై మాథుర్ అందరికి అదర్శంగా నిలుస్తుంది. ఈ గిరిజనుల స్పూర్తిని మిగితా వారు తీసుకుని పరిశుభ్రతను పాటిస్తే సగం వ్యాధులనుంచి మనం రక్షించబడినట్లే.

Tags:    

Similar News