GHMCలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థానచలనం
GHMC: మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా GHMC సూపరింటెండెంట్ వెంకటరమణ
GHMCలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థానచలనం
GHMC: GHMCలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థానచలనం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని.. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ అడిషనల్ డైరెక్టర్‌గా నియమించింది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించింది. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అభిలాష అభినవ్ ఐఏఎస్... శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా స్నేహ శబరిష్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా GHMC సూపరింటెండెంట్ వెంకటరమణను నియమించారు.