జనగామ జిల్లా వెల్దంద గ్రామంలో విషాదం... వరదలో కొట్టుకుపోయిన 110 గొర్రెలు
జనగామ జిల్లా వెల్డంద గ్రామంలో విషాద ఘటన భారీ వర్షాలకు ఏర్పడ్డ వరదల్లో కొట్టుకుపోయిన 110 గొర్రెలు
వెల్దంద గ్రామంలో విషాదం: వరదలో కొట్టుకుపోయిన 110 గొర్రెలు
జనగామ జిల్లా వెల్దండ గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. మొంథా తుఫాన్ రైతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన 110 గొర్రెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రోజువారీ లాగానే ఉదయం గొర్రెలను మేతకు తీసుకెళ్లగా.. వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో తిరిగి ఇంటికి వస్తున్న తరుణంలో గట్టమ్మ చెరువు మత్తడి దాటే క్రమంలో ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువ కావడంతో మొత్తం 110 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. వాటిలో 44 గొర్రెలు ఒడ్డుకు చేరగా... మిగతావి ప్రవాహంలోనే కొట్టుకుపోయాయి. పిల్లల్లగా పెంచుకున్న గొర్రెలు వరద ప్రవాహంలోనే కొట్టుకుపోవడంతో యజమానులు బోరును విలపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.