Ant Phobia: చీమల ఫోబియాతో ఆత్మహత్య చేసుకున్న మహిళ
Ant Phobia: చీమల ఫోబియాతో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
Ant Phobia: చీమల ఫోబియాతో ఆత్మహత్య చేసుకున్న మహిళ
Ant Phobia: చీమల ఫోబియాతో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మంచిర్యాలకి చెందిన మనీషాకి శ్రీకాంత్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా రెండున్నరేళ్ల క్రితం అమీన్‌పూర్‌కి శ్రీకాంత్ ఫ్యామిలీ వచ్చింది.
అయితే మనీషాకి చిన్ననాటి నుంచే మైర్మో కో ఫోబియా ఉండగా... ఈ మధ్య అది ఎక్కువ అయింది. కౌన్సిలింగ్ ఇచ్చినా మనీషా తీరు మాత్రం మారలేదు. భర్త లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చీమల ఫోబియాతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసిందని... ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అమీన్‌పూర్ సీఐ తెలిపారు.