Basara: బాసర గోదావరి వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు

Basara: భైంసా నుండి హైదరాబాద్, నిజామాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు

Update: 2023-09-28 09:27 GMT

Basara: బాసర గోదావరి వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు

Basara: బాసర గోదావరి వంతెనపై గణేశ్ నిమజ్జనంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, నిజామాబాద్ పట్టణ వినాయకులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వినాయకులు భారీగా రానున్నాయి. గోదావరి నది వద్ద భారీ క్రేన్‌ల సహాయంతో వినాయకులను గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను పర్యవేక్షించారు. గోదావరి నదిలో నిమజ్జనాల సందర్భంగా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. బైంసా నుండి హైదరాబాద్, నిజామాబాద్‌కు వెళ్లే వాహనాలు బిద్రెల్లి మీదుగా ధర్మాబాద్, కందకుర్తి, సాటపూర్, నవీపేట మీదుగా నిజామాబాద్ వెళ్లాలని పోలీసులు సూచించారు. నిజామాబాద్ నుండి భైంసా వెళ్లే వాహనాలు నవీపేట్, కందకుర్తి, ధర్మాబాద్ మీదుగా బిద్రెల్లికి చేరుకుంటాయి.

Tags:    

Similar News