Hyderabad: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: వీఐపీల పర్యటనలతో హైదరాబాద్‌లో పలుచోట్ల ఆంక్షలు

Update: 2022-07-03 04:45 GMT

Hyderabad: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ బీజేపీ బహిరంగ సభకు పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకుంటున్నారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు.

సభ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు అమల్లో ఉంటాయి. HICC, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రాజ్ భవన్, పంజాగుట్ట, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్, ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎన్డీ రోడ్, పరేడ్ గ్రౌండ్ తదితర ప్రాంతాల వైపు వాహనదారులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సీపీ ఆనంద్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే విజయ సంకల్ప సభ నేపథ్యంలో మొత్తం 7 గేట్లు ఉండగా, రెండు, మూడు గేట్లు మినహా మిగతా గేట్ల నుంచి ప్రజలను అనుమతించనున్నారు.

సభకు ఆటంకం కలగకుండా టివోలీ క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ మధ్య రహదారి మూసివేయనున్నారు. దాంతో చిలకలగూడ, అలుగడ్డబాయి, సంగీత్, YCMA, ప్యాట్నీ, SBH క్రాస్ రోడ్లు, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, స్వీకా రాప్కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి క్రాస్ రోడ్, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల వైపు రాకుండా వాహనదారులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు

Tags:    

Similar News