Mahesh Kumar Goud: రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ కనుమరుగవుతుంది
Mahesh Kumar Goud: తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దత్తుదారులు విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud: తెలంగాణలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దత్తుదారులు విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేజన్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రిజర్వేషన్లను రాజ్యాంగబద్దంగా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ 42శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ, బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్.