టోఫెల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్‌ గుట్టురట్టు

* ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఎగ్జామ్‌ని కాపీ చేసిన కేటుగాళ్లు

Update: 2023-02-08 02:21 GMT

టోఫెల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్‌ గుట్టురట్టు

TOEFL Exam: విదేశాలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా రాసే టోఫెల్ ఎగ్జామ్‌ ఆన్‌లైన్‌ మాస్ కాపీయింగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న మాస్ కాపీయింగ్ రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరోవైపు విదేశాల్లో చదివే విద్యార్థులకు యూనివర్శిటీల్లో ఫీజు చెల్లిస్తామని మోసాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు చెల్లించడంతో అమెరికాలో క్రెడిట్ కార్డ్ స్కాం బయటపడింది. దీంతో విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు ఫీజు చెల్లింపులో కోటిన్నరకు పైగా స్కామ్ చేసిన ముఠా సభ్యుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News